LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Gaganamu Daati

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
గగనము దాటి ఎగరాలి చూడు వయసుందోయ్ నేడు
దొరకనిదంటూ లేదంటా ఇపుడూ
కనులను తెరిచి అందాలను చూడు
కలలేనా ఎపుడూ జిందగి ఒకటే లేవంటా రెండూ
నిలబడి చూస్తూనే ఉంటే నిలవదు కద ఈ సమయం
చిలిపిగ గడిపెయ్యాలంటా జీవితం ఓ
మనసుతో అడుగెయ్యకపోతే దొరకదుగా సంతోషం
ప్రతి ఒక నిమిషం వరమనుకో నీతో రాదా లోకం
ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంట యుద్ధమే
చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే

మనసే వెతికే పయనాలే మొదలాయే
కనుకే కనులే మెరిసాయే ఏఏ
మదిలో ఎన్నో భావాలే కదిలాయే
నడిపే జతనే పిలిచాయే

బ్రతుకంటే ఊహకందని చిత్రాలే
అనుకుంటూ సాగితేనే ఆనందాలే ఏఏ ఏ
ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ

ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంట యుద్ధమే
చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే

ఎపుడూ నీతో ఉంటుందా ఈ ప్రాయం
కనుకే బ్రతికెయ్ ప్రతి నిమిషం ఆ

ఏదో ఒకటి అంటుందోయ్ ఈ లోకం
అన్ని వినకోయ్ నువు కొంచెం

మధురంగా ఉండనీ మరి నీ గమనం
సరదాగా చేరుకోవాలి నీ గమ్యం

ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ
ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంట యుద్ధమే
చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే

WRITERS

ALARAJU, RR DHRUVAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None