అయ్యో వెళ్ళిపోయావే నన్నొదిలేసి ఎటు పోయావే
అమ్మ ఇకపై నే వినగలనా నీ లాలి పాట
నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావో అంతే చాలంట
చెరిగిందే దీపం కరిగిందే రూపం
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం
పగలే దిగులైన నడి రేయి ముసిరింది
కలవర పెడుతుంది పెను చీకటి
ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది
ఓ అమ్మ అమ్మ నీ పసివాడనమ్మ
వీడలేక నిన్ను విడిపోయి ఉన్నా
మరణాన్ని మరిచి జీవించి ఉన్నా
నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా
కాలం కలకాలం ఒకలాగే నడిచేనా
కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరాలోన
అడుగై నీతోనే నడిచొస్తున్నా
అద్దంలో నువ్వై కనిపిస్తున్నా
అయ్యో వెళ్ళిపోయావే.. నీలో ప్రాణం నా చిరునవ్వే
అమ్మ ఇకపై నే వినగలనా నీ లాలి పాట
వెంనంటే చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా