LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Baava Chandamaamalu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
బావా చందమామలు మరదళ్ళు
వీరె ఇంటికి మణి దీపాలు
గుణంలో మేలిమి బంగారు పనుల్లో ఎవ్వరు సరిపోరు
మావాళ్ళ ముందర మీవాళ్ళు నిజంగా తేలిపోతారు

భామా సూర్యచంద్రులు మా వాళ్ళు
నాకు వీరె భరత లక్ష్మణులు
నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు
నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు

ఎప్పుడో అప్పుడు ప్రేమలో మునగడం తప్పదమ్మ నీకు కూడా
ఎవ్వరో అతడు ఎక్కడో ఉండటం చెప్పవయ్య వాడి జాడ
రాజా లా ఉంటాడే ప్రేమంటే వాడే లే
నచ్చితే అమ్మడు చెప్పవే ఇప్పుడు పట్టు పట్టి జట్టు చేస్తాం
చక్కని వదినకి సయ్యనే అన్నకి వీడిపోని బంధమేద్దాం
ఊఒ అంటే కన్యా రత్నాలే కానిద్దం కన్యా దానాలే
వయ్యారి అక్కా-చెల్లెళ్ళే అవుతారు తోడి కోడళ్ళే

ఆనందం
మీ అందం
సంగీతం మా సొంతం

కొంగుతో కొట్టడం పైటనే జార్చటం నచ్చినట్టు గుర్తులే లే
గుచ్చుతూ చూడటం గుండెనే పిండడం తీయనైన ప్రేమ తీరే
ఆ ప్రేమే స్వీకారం
నీకే నా సహకారం
అక్క లే ఆకులై బావలే వక్కలై పక్క పక్క చేరుకోండి
ఉమ్మడి కాపురం ఉత్తమం అందరూ ఒక్కటిగ సాగిపోండి
భలేగ చెప్పావ్ బాబయ్య మా ఇంటి పెళ్ళిళ్ళ పేరయ్య
మరేమో పెద్దంటినోడయ్య చెయ్యండి నన్ను తాతయ్య

భామా సూర్యచంద్రులు మా వాళ్ళు
నాకు వీరె భరత లక్ష్మణులు
నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు
నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు

WRITERS

JONNAVITHULA RAMALINGESWARA RAO, MANI SHARMA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other