LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ennallamma Ennallamma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ
వేకువ రావాలమ్మా వేదన తీరాలమ్మా
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ
వేకువ రావాలమ్మా వేదన తీరాలమ్మా
ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా
ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా
ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా
ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా

బడిలో మీకిక చదువే లోకం
బలపం పట్టే వేళా గురువే దైవం
పెరిగే ఈడున న్యాయం నేరం
కలలే కన్నీళ్ళైతే బతుకే భారం
నేర్చిన అర్ధాలన్నీ మారిపోయేను
పేర్చిన స్వప్నాలన్నీ కూలిపోయేను
ఆ కళ్ళ శోకాలు ఈ కుళ్ళు లోకాలు నిన్ను నన్ను నేడు చుట్టుముట్టెను
చేతులు కలపండిరా సైనికులై లెండిరా
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ
వేకువ రావాలమ్మా వేదన తీరాలమ్మా

లలాలలాలలాలలలాలలాలలాలలలాలలాలలాల
లలాలలాలలాల లలాలలాలలాల లలాలలాలలాల ల ల లాలాలా
లలాలలాలలాల

కదిలే కాలమై గమనం సాగి యదలో ధ్యేయం కోసం సమరం రేగి
రగిలే గాయమై పొగిలే ప్రాణం పగిలే గేయం తానై మిగిలే గానం
కన్నోళ్ళ కన్నుల్లోన వెన్నెలే పంచి
ఇన్నాళ్ళ చీకట్లకు చెల్లు రాయించి
కష్టాలు లేనట్టి కన్నీళ్ళు రానట్టి పూల దారుల్లోకి సాగిపోదాము
నేర్పుగా నడవండిరా మార్పును కోరండిరా
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ
వేకువ రావాలమ్మా వేదన తీరాలమ్మా

ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా
ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా
లలాలలాలలాల లలాలలాలలాల లలాలలాలలాల ల ల లాలాలా
లలాలలాలలాల లలాలలాలలాల లలాలలాలలాల ల ల లాలాలా

WRITERS

Adrushta Deepak

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other