LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Janavule Nerajanavule

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో అహహహా
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో అహహహా
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

మోమటు దాచి మురిపెంపెంచే లాహిరిలో అహహహా
మూగవుగానే మురళిని వూదే వైఖరిలో
చెలి వొంపులలో హంపికళ వూగే ఉయ్యాల
చెలి పైయెదలొ తుంగ అలా పొంగే ఈ వేళ
మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా
జాణవులే వరవీణవులే కిలికించితాలలో అహహహా
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో
జాణవులే వరవీణవులే కిలికించితాలలో అహహహా
నెరజాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో అహహాహహా ఒహొహోహొహో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో
చెలి నారతిలా హారతిల నవ్వాలీవేళ
తొలిసోయగమే ఓసగమై ఇవ్వాలీవేళ
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగున
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో అహహహా
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో అహహహా
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

WRITERS

ILAYARAJA, VETURI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other