LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Pandiri Vesina

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పందిరి వేసిన ఆకాశానికి యివమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకు యివమ్మా ఆహ్వానం
నువ్వు రామ్మా ఓ వేదమా విడాకుల పత్రిక అందుకుని జంటని వేరు చేయూమ్మ
దంపతులు విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకో వామ్మ
పందిరి వేసిన ఆకాశానికి యివమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకు యివమ్మా ఆహ్వానం

ప్రతి మనువు స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా
ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడ గొడుతుందా

నీ రాతకు యెంత సత్యం ఉందొ చూతుము బ్రహ్మయ్యా
నీ సాక్షం యెంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా
నువ్వు రామ్మా ఓ అరుంధతి ఇదే నీ దర్శన బలం ఐతే ఎటైనా దాగి పోవమ్మా
నిజంగ పెళ్ళికి బలం ఉంటె చూటీగా యిటు దిగిరావమ్మ
పందిరి వేసిన ఆకాశానికి యివమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకు యివమ్మా ఆహ్వానం

చితి మంటల సహగమనం ఒకసారే బలి చేస్తుంది
పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది

ఆ జ్వాలాల తోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు
నువ్వు రామ్మా మాంగల్యమా
వివాహపు వేదికలో నిన్ను మూడేసి నిన్నటి వేళ్ళకి
విడాకులా వేడుకలో నేడు తెంపడం నేర్పడానికి
పందిరి వేసిన ఆకాశానికి యివమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకు యివమ్మా ఆహ్వానం

WRITERS

Sirivennela

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other