చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జానా ఆడింది వయ్యారంగా
నీళ్ల పూలు జల్లింది సింగారంగా
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జానా ఆడింది వయ్యారంగా
నీళ్ల పూలు జల్లింది సింగారంగా
నింగి నెల ఈవేళ చలికి వణికిపోతుంటే బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది
ఈ కౌగిలింతలోన ఏలొ గుండెల్లో ఎండ కాసే ఏలొ
పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వలవేయక సెలయేరై పెనవేసింది
అరేయ్ చినుకమ్మ మేరుపమ్మ ఏలొ చిటికేసే బుగ్గ మీద ఏలొ
తలపు తొలివలపు ఇక తక ఝం తక ఝం
వయసు తడి సొగసు అరా విరిసే సమయం
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జానా ఆడింది వయ్యారంగా
నీళ్ల పూలు జల్లింది సింగారంగా
మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది ఎదలోపల చలిగాలుల సుడి రేగింది
వానొచ్చే వరదొచ్చె ఏలో వయసంటే తెలిసొచ్చే ఏలో
మేళ చూపు పోయింది వాలు చూపు సై అంది చెలి కోరిక అలవోకగా తల ఊపింది
అరేయ్ సరసాల సింధులోన ఏలో సరి గంగ తానాలు ఏలొ
వొడిలో ఇక ఒకటై తక తాకథై అంటే
సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జానా ఆడింది వయ్యారంగా
నీళ్ల పూలు జల్లింది సింగారంగా
చినుకు చినుకు అందెలతోచిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జానా ఆడింది వయ్యారంగా
నీళ్ల పూలు జల్లింది సింగారంగా