పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట
నీలిమబ్బులకు స్నానం పోసే చిటపట పాట
రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట
కన్నతల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట
దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట
ధీమ్ తననన ధీమ్ తననన ధీమ్ తననన ధీమ్ తననన ధీమ్ తననన
త త ద త ద త త ద త త ద త ద త త ద త త ద త ద త త ద
ధీమ్ తననన ధీమ్ తననన ధీమ్ తననన ధీమ్ తననన ధీమ్ తననన
లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట
పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట
చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట
పడుచు గుండె ప్రాంగణాల మోగుతున్న పాట
అందరూ మెచ్చే పాటా ఒకరికి అంకితమిచ్చే పాట
అందరూ మెచ్చే పాటా ఒకరికి అంకితమిచ్చే పాట
పదాలు అన్నీ బోయిలై ప్రేమ పల్లకిని మోసే
గమప గమప మపప సరిగనిసనిపనినిసా
గమప గమప మపప సరిగనిసనిపనినిసా
నిసగాస నిసగా గమగా మగమా సగస గమగమదామా పనిసా నిసామగసాదనిసా
పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట
కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట
నదులల్లోని జివరాగమే నింపుకున్న పాట
వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట
ప్రకృతి నేర్పిన పాట చక్కని ఆకృతి దాల్చిన పాట ఆ ఆ ఆ
ప్రకృతి నేర్పిన పాట చక్కని ఆకృతి దాల్చిన పాట
మనస్సు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసే పాట
పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట
నీలిమబ్బులకు స్నానం పోసే చిటపట పాట
రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట
కన్నతల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట
దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట
సరిగనిసనిపనినిసా సరిగనిసనిపనినిసా