LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mondi Thalli Pilla Nuvvu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అమ్మ గుండె బరువే చెప్పుకుంది వినవే ఊపిరంతా పోగేసి రాశా
తప్పటడుగులలో బిక్కుమన్నా వేళలో పక్కనుండలేనమ్మా బహుసా
నువ్వెక్కడా అంటూ చూడొద్దు నేనచ్చంగా నీలానే ఉంటా
నా పంచ ప్రాణాల బొమ్మ మీద దిష్టి చుక్క నేనై ఉంటా
మొండి తల్లి పిల్లా నువ్వు నీ అడుగే తడబడితే ఇదిగో నీ వెనకే ఉంటానులే చిన్నారి తల్లి
కలకో భయపడకే ఏపుడూ నీ కునుకై ఉంటానులే చిన్నారి తల్లి
మొండి తల్లి పిల్లా నువ్వు

చిమ్మచీకటాల్లుకున్నా కారుమబ్బు కమ్ముకున్నా చందమామనీ ఇంతైనా తాకలేవు ఏవీ
మట్టి మట్టుబెడుతున్నా అగ్గి ఎండగడుతున్నా చిన్ని విత్తనం చేతుల్లో ఒడిపోయి తీరాలిలే
రాకాసి సంద్రమంచులో తేలేటి నావపై జాలి పడదే కెరటం
భూమిపై కాలు మోపినా ఆ చోటా మొదలై ఆగది పోరాటం
మొండి తల్లి పిల్లా నువ్వు నీ అడుగే తడబడితే ఇదిగో నీ వెనకే ఉంటానులే చిన్నారి తల్లి
కలకో భయపడకే ఏపుడూ నీ కునుకై ఉంటానులే చిన్నారి తల్లి
మొండి తల్లి పిల్లా నువ్వు

కళ్ల గంత కట్టుకున్నా చేతులడ్డు పెట్టుకున్నా కష్టమన్నది కొంతైనా మాయమై పోదే
కత్తికెంత పదునున్నా రాయికెంత బలమున్నా నీటి ధార నే తెచ్చిన దాఖలాలే లేవులే
గాలిలో కేగె ధైర్యమే లేదంటే రెక్కలే నీకున్నా వ్యర్ధం
చివ్వరి శ్వాస చెప్పిన ఈ మాట గుండెల్లో దాచుకోవే కొంచెం
మొండి తల్లి పిల్లా నువ్వు నీ అడుగే తడబడితే ఇదిగో నీ వెనకే ఉంటానులే చిన్నారి తల్లి
కలకో భయపడకే ఏపుడూ నీ కునుకై ఉంటానులే చిన్నారి తల్లి
మొండి తల్లి పిల్లా నువ్వు

WRITERS

Emani Naga Sai Venkata Radhakr Harsha, Chaitan Bharadwaj

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other