LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mudinepalli

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
బుట్ట మీద బుట్టపెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి వాగల్లే నడిచావే
నీ బుట్టలోన పువ్వులన్నీ గుట్టులన్నీ రట్టుచేసి నన్నీడ పిలిచేనే

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా

పల్లి పల్లి ముదినేపల్లి
పల్లి పల్లి ముదినేపల్లి

కాటుక కళ్ల వాడల్లో కట్టుకుంటా గుడిసెంటా
పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంటా
చింతపల్లి చిన్నోణ్ని చూడు నీకు వరసంటా
వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంటా
పగలు రేయి (నీతో ఉంటా)
ఉన్నావంటే (అది తప్పంట)
కలిసి వస్తే వెన్నెలమాసం చెయ్యలి జాగారం

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే

తననాననాననాననా తననాననాననాననా తననాననాననాననా

తమలపాకు తడిలోన పండెనే నీ నోరంటా
నోటి పంట కాదంటా పాడిపంట చూడంటా
నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట
ఆశపడిన మావయ్యది అందమైన మనసంట
అందం చందం (నీకే సొంతం)
వెన్నోల్లోనే (యేస్తా మంచం)

పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే

తననాననాననాననా తననాననాననాననా తననాననాననాననా

WRITERS

Late Yadagiri, K. V. Mahadevan

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other