LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Thanu Vethikina

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తను వెతికిన తగు జత నువ్వేననీ
కను తెరవని మనసుకు తెలుసా అని
బదులడిగిన పిలుపది నీదేనని
తెర మరుగున గల మది విందా అని
వెలుగేదో కనిపించేలా నిన్నే కురిపించేలా
చుట్టూ కమ్మే రేయో, మాయో మొత్తం కరగాలి
ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి
తను వెతికిన తగు జత నువ్వేననీ
కను తెరవని మనసుకు తెలుసా అని
బదులడిగిన పిలుపది నీదేనని
తెర మరుగున గల మది విందా అని

ఉరికే అల్లరి ఉడికే ఆవిరి
ఎవరూ నా సరి లేరను వైఖరి
పొగరనుకో, తగదనుకో, సహజగుణాలివి
వలదనుకో, వరమనుకో, వరకట్నాలివి
ఒడుపుగ వరస కలిపి మహాశయా మగువనేలుకో
నిను తలవక గడవదు కద కాలం
నిను కలవక నిలవదు కద ప్రాణమూ

కన్నె కళ్యాణికి కళ్ళెము వేయవా
అతిగారానికి అణకువ నేర్పవా
కసురుకునే కనుబొమలే కలహము ఓడనీ
బిడియపడే ఓటమిలో గెలుపును చూడని
చెలియతో చెలిమి కలిపి తలపు తడిమి తడిని తెలుసుకో
అదుపెరుగని దివి గంగను నేనటా
అతిశయమున ఎగసిన మది నాదట
ఒడుపెరిగిన శివుడవు నీవేనట
జడముడులతొ నిలుపద నను నీ జత
పని మాలా బతిమాలాలా ప్రేమా పలుకవదేలా
నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటున్నా
పట్టు విడుపూ లేని లేని పంతం ఇంకానా

WRITERS

GOPI SUNDAR, SIRIVENNELA SEETHARAMA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other