ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడినాదాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా మనసు లోలో నిలువదే
నిదురలేదు కుదురులేదు నిమిషమైనా నాకే
కదలలేను వదలలేను మాయా నీదేనా
మాటలైనా రానేరావు పెదవిదాటే పైకే
పక్కనున్న వెతుకుతున్నా నేను నిన్నేనా
ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం
నీతో సావాసం నను చేసేనా మాయం
తారలన్ని రాలిపోయే కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయే మనసు తనువులు తాకితే
ఎదురుచూడని స్నేహమే ఎదురువచ్చిన వేళలో
ఎవరు చూడని వైపుకే వెతికి వచ్చిన తోడువో
గుండెలో మాట చెప్పలేకున్నా ఆ మాయలో నేనున్నా
ఎంత చూస్తున్నా చాలలేదమ్మా నా కళ్లలో దాగిపోవా
ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడినాదాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా మనసు లోలో నిలువదే
నిదురలేదు కుదురులేదు నిమిషమైనా నాకే
కదలలేను వదలలేను మాయా నీదేనా
మాటలైనా రానేరావు పెదవిదాటే పైకే
పక్కనున్న వెతుకుతున్నా నేను నిన్నేనా
ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం
నీతో సావాసం నను చేసేనా మాయం
తారలన్ని రాలిపోయే కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయే మనసు తనువులు తాకితే