LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Paluke Bangarama

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పరుగు తీస్తున్న పరువమా పరిమళిస్తున్న మరువమా
తలపు లోతుల్లో తియ్యని గాయమా
అతనితో చూపు కలుపుమా సూటిగా మాట తెలుపుమా
బయటపడలేని తికమక న్యాయమా
ఇదే తంతు కొన్నాళ్ళుగా నీలో
ఆలోచిస్తూ ఎన్నాళ్ళు ఊహల్లో
ఎదలో స్వరమా పలుకే బంగారమా
తనలో సగమా అయినా మోమాటమా

తొనకిసలయే తొలి పదనిస తనలో తనే నలుగుతోంది
గుస గుస గుస పరవశమయే పాటగా
తొలకరి నశా తెలియక దిశ అటు ఇటు ఎటో తిరుగుతోంది
కలవరమయే తెరమరుగునే దాటగా
కులాసాగా ఈ హాయి బావున్నా
ఫలానాగా మౌనాలు వీడేనా
ఎదలో స్వరమా పలుకే బంగారమా
తనలో సగమా అయినా మోమాటమా

WRITERS

D RAMAJOGAIAH SASTRY, SRI CHARAN PAKALA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other