నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
కిల కిల నవ్వి ఈలే వేస్తావేమలా
సరెలే పోనీ అంటూ వెళితే నేనలా
చిటపటలాడి చిందేవేస్తావేంటలా
తెలుసా జడివాన తొలి చినుకై నువ్వు తాకేయగా
తడిసె నెరజాణ సిరి నెమలై కురి విప్పేయగా
ఘల్లు ఘల్లుమని అందెలు ఆడెనులే
అరె ఝల్లు ఝల్లుమని చినుకే రాలెనులే
జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే
తను ఏడు రంగుల విల్లై ఊగెనులే
ఎంత ధైర్యమే వాన మా ఇంటికొచ్చి నా పైన
చిటుకు చిటుకు అని జారీ చల్లని చినుకై ఎద చేరి
సరదాల వరదలో నేనుంటే పరువాల పొంగులను చూసే
వెలుగైనా చూడని ఒంపుల్లో తనువార జలకమే ఆడే
చనువిస్తే తుంటరి వాన తొలి ప్రాయం దోచడమేనా
సరికాదే కొంటె వాన ఎద మీటి పోకే సోనా
నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
కిల కిల నవ్వి ఈలే వేస్తావేమలా
వింత చేసేనీ వాన కురిసింది కొంతసేపైనా
తడిపి తడిపి నిలువెల్లా తపనై వెలిసే హరివిల్ల
చిరుజల్లు వలచిన ప్రాయాలే మరుమల్లె తీగకారిస్తే
సెలయేటి అద్దమును చూపించి మెరుపల్లె మేనిలో చేరి
చనువిస్తే తుంటరి వాన తొలి ప్రాయం దోచడమేనా
సరికాదే కొంటె వాన ఎద మీటి పోకే సోనా
ఘల్లు ఘల్లుమని అందెలు ఆడెనులే
అరె ఝల్లు ఝల్లుమని చినుకే రాలెనులే
జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే
తను ఏడు రంగుల విల్లై ఊగెనులే