ఓ ఎగిరే ఎగిరే నా పాదాలు పైకెగిరే
దిగవే దిగవే దిగమన్న ఆకాశమే
ఎగిరే ఎగిరే లేరెవరంటూ మనకెదురే
ఎదురయ్యనులే సరికొత్త ఆనందమే
పదవే పదవే మనసా పంజరమొదిలి వయస
పచ్చని కలలే తెలుసా పల్లకీ తెచ్చెనే
వినవే వినవే సొగస స్వేచ్ఛగా అడుగే వేసా
సంకెళ్లన్నీ తెంచి దిక్కులే దాటవే
వరదై ఈ వేగాన ఓ రాగాన నేనే సాగనా
ఎన్నో వర్ణాల వానవిల్లే నన్నే అల్లిందే స్నేహమల్లే
వచ్చి వాలిందే కళ్లముందే ఇవ్వాలే
కొమ్మారెమ్మల్లో కోయిలల్లే కొత్త రాగాలె పొంగి పొర్లే
ఇంత ఆనందం లేదు ముందే నీవల్లే
గదిలో ఒదిగున్న నా ఊసులే వదిలా సీతకోకచిలకై
మదిలో అనిగున్న నా ఆశలే అలలై ఉవ్వెత్తునెగిసాయిలే
మరల మనిషై నేడు పుట్టానిలా
ఒక్కో క్షణాన్నే ఒడిసిపడదాం
ఇంకో లోకంలో అడుగుపెడదాం ఇవ్వాలే
అలె అలలే ఆలే ఆలే అలె అలలే ఆలే ఆలే అలె అలలే ఆలే ఆలే ఆలేలే
గతమే గుర్తంటు లేనంతగా గడిపా ఒక్కో క్షణమే వరమై
ఇకపై ప్రతిరోజు నాదంటుగా మనసే విరిసింది వాసంతమై
వీచేగాలై తోచే దిశగా అడుగే కదిపా నలువైపులా
అడిగే వారే అసలే లేరుగా కనుకే చినుకై చెలరేగిపోయానిలా
భారం కనుల్లో తీరిపోయే ఈ వేళే
అలె అలలే ఆలే ఆలే అలె అలలే ఆలే ఆలే అలె అలలే ఆలే ఆలే ఆలేలే