నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్న
నీకళ్ళ వాకిళ్ళలో ముగ్గులాగ ఉన్న
ఓహో నీలాల నింగినే నే కళ్ళకద్దినా
నీ చూపు విరుపులే వేల మెరుపులా
మేఘాల తీరుగా కంటిపాప కదలగా
నీ కంటి చెమ్మనే తుడిచెదనా
ఓ ఓ బోనమెత్తిన బుట్టబొమ్మలా
ఉట్టిలో దాచుకున్న సద్దిబువ్వ
ఆ పాలపిట్ట పైట దీపాల చిట్టి రైక
నీకన్న పెద్ద అందమే నాకు ఎందుకమ్మ
ఈ జన్మతోటి సాలునే పంచుకుంటనమ్మా
గంటకొక్కసారి గుండె తట్టినావే
మాగాణిలోని గట్టు నీ ఓని పూల జట్టు
నీ సోగకళ్ళ చాటు తేనల్ని దాచినట్టు
నీ అందమంత కళ్ళలో నింపుకొంటినమ్మ
ఓహో పుత్తడీ బొమ్మ (బొమ్మా)
నీ పేరు పక్క పేరునే రాసుకొంటినమ్మా