మరణపు ముల్లు విరిగిపోయింది
మరణం విజయమందు మ్రింగబడింది
జయహో రారాజుకు జయవీరుడు శ్రీయేసుకు
మరణం తరువాత జీవితం ఉందనే వాస్తవం తెలిసొచ్చింది
ప్రధమముగా చావు చావగా చరిత్రయే తిరుగబడింది
యేసయ్య దేహం ఉంచిన సమాధి ఖాళీయై కనిపించింది
భద్రతలన్నీ నిర్వీర్యమవ్వగా శత్రువుకు వణుకొచ్చింది
క్రీస్తేసునందు నిద్రించిన ప్రజల నిరీక్షణ ఫలియించింది
మరణించి యేసు తిరిగి లేవగా విశ్వాసికి బలమొచ్చింది