ఎట్టి ప్రేమననుగ్రహించినావు యేసయ్యా
గొప్ప ధన్యతనుగ్రహించినావు మెస్సీయా
ఆహా హల్లెలూయా, ఆరాధనీయుడా
ఆహా హల్లెలూయా, మాపాలి దేవుడా
మేము నిన్ను ప్రేమించితిమని కాదయ్యా
నీవు మమ్ము ముందుగా ప్రేమించినావయ్యా
నీ ప్రేమను ప్రత్యక్షపరచినావయ్యా
మాలోన నీవు నిలిచియున్నావయ్యా
నీలోనే మమ్ము నిలుపుకున్నావయ్యా
లోకమును జయించు శక్తినిచ్చినావయ్యా