నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా యేసయ్యా
నీ శక్తితో కార్యాన్ని జరిగించుచున్నావయా
యేసయ్యా నీవు నాకుంటే చాలయా
నీ మాటతో సంతృప్తి కలిగించుచున్నావయా
యేసయ్యా నీవు నాకుంటే చాలయా
నీ ఆజ్ఞతో విశ్రాంతి నెలకొల్పుచున్నావయా
శ్రమపడ్డ నాకు ఫలితమిచ్చుచు
యేసయ్యా నీవు నాకుంటే చాలయా
నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా యేసయ్యా