LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Oohakandhani

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఊహకందని ప్రేమ - అనురాగబంధమీ ప్రేమ
దీనునిపై దీవెనలు కురిపించిన ప్రేమ
పరమతండ్రి చూపించిన ప్రేమ
విడువకుండ హెచ్చించిన ప్రేమ

ఏమియు లేకుండ కడు దీనుడనైయుండ
నా స్థితి గమనించి ఉద్ధరించిన ప్రేమ
సిగ్గుపడినచోటే తల పైకి ఎత్తిన ప్రేమ
విరోధులను విస్మయపరచిన ప్రేమ

బాధ్యతలేకుండ కఠినాత్ముడనైయుండ
భారము కలిగించి మంచి నేర్పిన ప్రేమ
జారిపడినచోటే స్థిరపరచి కాచిన ప్రేమ
అనేకులకు మేలుగ మార్చిన ప్రేమ

యోగ్యత లేకుండ బలహీనుడనైయుండ
కార్యము జరిగించి ప్రాప్తి పెంచిన ప్రేమ
ఓడి చెడినచోటే విజయాలు ఇచ్చిన ప్రేమ
సమాజములో సాక్షిగ నిలిపిన ప్రేమ

WRITERS

Adivikatla Robert Stevenson

PUBLISHERS

Lyrics © Ambala Productions

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist