హితుడవు నీవే శుద్ధుడ నీవే
తండ్రివి నీవని తల్లివి నీవని
స్నేహితుడవు నీవని శరణనిజొచ్చితి
పాహిమాం ఓ ప్రభు నిరతము కాపాడెదవు
నీ నామస్మరణే నా జీవనపరమార్థం
శ్రమలో కేడెమై కరుణలో సంద్రమై
మహిమాన్వితుడవని బాధతో ఏడ్చితి
రక్షించు ఓ ప్రభు శ్రమ మరిపించెదవు
నీ సంకీర్తనయే నా ప్రాణాధారం
ఎత్తైన కొండవై దృఢమైన కోటవై
దుడ్డు కర్ర దండమై ఒంటరినైతిని
నడిపించు ఓ ప్రభు నడిసంద్రమునైనను