LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Yuddamu Cheyutaku

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు
ఏమీ చేయవలెనో మాకసలు తోచదు
అ.ప.: మాకు దిక్కు నీవే దేవా

అనుకూలించక పరిస్థితులన్నీ
ఎదురు తిరుగుతుంటే
అనుమానముతో హృదయములోన
దిగులు కలుగుతుంటే
మా కన్నులు నీపైనే

పడద్రోయాలని తరిమేవారు
చెలరేగుతు ఉంటే
నడిచే దారి మూసుకుపోయి
భయము పెరుగుతుంటే
మా కన్నులు నీ పైనే

కదిలే నావకు కెరటాలెన్నో
అడ్డు తగులుతుంటే
మదిలో ఆశ నిజమేకాక
మనసు రగులుతుంటే
మా కన్నులు నీపైనే

WRITERS

Adivikatla Robert Stevenson

PUBLISHERS

Lyrics © Ambala Productions

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist