LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Arugu Meedha

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అలికి పూసిన అరుగు మీన
కలికి సుందరినై కూసుంటే
పలకరించావేంది ఓ దొరా
సిలక ముక్కు చిన్ని నా దొరా
ఎతికి చూస్తే ఏడూళ్లయినా
నీలాంటోడు ఇక దొరికేనా
ఎందుకింత ఉలుకు ఓ దొరా
ఎండి బంగారాల నా దొరా
సైకోలెక్కి సందమామ
సిక్కోలంతా ఎన్నెల పంచి
చిన్నబోయి వచ్చావేంది
నీలో ఉన్న మచ్చను తలచి
కొండా నిండా ఎలుగే నీదిరా
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొరా
నా గుండె మీద వాలిపోరా
ఊపిరి పోస్తా దొరా
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొరా
నా గుండెలోన తప్పెట గుళ్ల
సప్పుడు నువ్వే దొరా

అలికి పూసిన అరుగు మీన
కలికి సుందరినై కూసుంటే
పలకరించావేంది ఓ దొరా
సిలక ముక్కు చిన్ని నా దొరా

గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వా
నీకు దిష్టి పూసలాంటిది సిరిమువ్వా
ఓయ్ రాజా
నెలరాజా
ఎంత కట్టమైన గాని నీ తోవ
నన్ను రెక్కలలో సుట్టుకోవా
సింతాపూలా ఒంటి నిండా
సిటికెడంతా పసుపు గుండా
సిన్నాదాని చెంపల నిండా
ఎర్ర ఎర్ర కారం గుండా
వన్నెలన్నీ నీవే సూర్యుడా
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొరా
నా గుండె మీద వాలి పోరా
ఊపిరి పోస్తా దొరా
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొరా
నా గుండెలోన తప్పెట గుళ్ల
సప్పుడు నువ్వే దొరా

WRITERS

Kasarla Shyam

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist