కోలో కోలన్న కోలో కొమ్మలు కిల కిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి
ఆరారు రుతువుల్లోని అక్కర్లేనిది ఏముంది
చూడలేగాని మన్నే రంగుల పూదోట తవ్వుతుంది
తోడై నీవెంట కడ దాకా నేనుంట
రాళ్ళైన ముళ్ళైన మన అడుగులు పడితే పూలై పొంగాలా
నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే
నిన్ను వెంటాడే దిగులే వెళ్ళిపోతుందా
యమ ధైర్యంగా ఎదుటెల్లి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింక ఉంటుందా
కోలో కోలన్న కోలో కొమ్మలు కిల కిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి
చిన చిన్న అనదలు చిన్నబోని అనుబంధాలు
అప్పుడప్పుడు చెక్కిలిగింతలు పెడుతుండగా
కలత కన్నీళ్లు లేని చిననాటి కెరింతల్ని
చిటికేసి ఇటురమ్మంటూ పిలిపించగా
కదిలోస్తూ ఉంది చూడు కన్నులవిందుగా
ఊరందరినీ కలిపే ఉమ్మడి పండుగ
హా నలుగురితో చెలిమి పంచుకో
జడివాన పడుతున్న జడిసేన తడిసేన
నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైన
నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే
నిన్ను వెంటాడే దిగులే వెళ్ళిపోతుందా
యమ ధైర్యంగా ఎదుటెల్లి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింక ఉంటుందా
నీలోను నాలోను ఈ నేలేగా అమ్మైయింది
అంతా అయినోళ్ళేగాని పరులెవ్వరూ
మనలోని చుట్టరికాని మరిపించే ఈ దూరాని
చెరిపే వీలుంధంటే కాదనరెవ్వరు
ఒక పువ్వు విచ్చిన గంధం ఉరికే పోదుగా
పదిమందికి ఆనందం పంచకపోదుగా
ప్రతినిత్యం పున్నమిగ అనుకోధ నెలవంక
కలలన్నీ విరియగా విరిసిన వెన్నెలగా
నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే
నిన్ను వెంటాడే దిగులే వెళ్ళిపోతుందా
యమ ధైర్యంగా ఎదుటెల్లి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింక ఉంటుందా
కొలో కొలన్న కొలో కోమలు కిల కిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి