గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టుగుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా
హె గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టుగుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా
బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో
నీకు దండం పెడతా దయ చుడమంటా
రోట్లో వుంది కొబ్బరి చెక్క బెట్టు బెట్టుగా
రోకలి పడితే లొంగుతుంది బిట్టు బిట్టుగా
కొబ్బరి పెడతావో అరచి బొబ్బలు పెడతావో
నీకు సాయంగుంటా లౌజెట్టమంటా
చెంపకు చారెడు కన్నులు దానా చేలోకొస్తావా
వెచ్చని వెచ్చని వెన్నెల కూనా వాటేస్కుంటావా
కత్తెర చూపుల తిత్తిరిగాడా వలలో పడతానా
తిక్కని రేపితే టక్కరి వాడా ఒళ్ళో పడతానా
అరె పందెం నీ బుర్ర కాస్త మందం
కవి తిక్కన రాసిన కందం జాజారే జానా
కాదని అంటావో ముద్దుగ ఔనని అంటావో
గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టుగుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా
అలకలు వస్తే చిలకని పట్టే secret చెబుతాలే
బుగ్గన పుసిన బూరెలు రెండూ కానుక ఇస్తాలే
కొవ్వూరి హనుమంతయ్యో సయ్యరే సయ్యో
రెమ్మల చాటున చుమ్మలు పెడితే గమున వుంటావా
చిమ్మిలి మెక్కిన తిమ్మిరి బొమ్మని చేతికి ఇస్తావా
సిరికొండా పూనా దానిమ్మపండా
పుత్తూరి కలకండా ఉంటాలే అండా
ఎత్తుకు పోతావో మత్తుగ హత్తుకు పోతావో
నేను నీ వెంటుంటా నీ బాంచనంటా
గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టుగుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా
బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో
నీకు దండం పెడతా దయ చుడమంటా హ హ హ
హె గిల గిల గిల గిల గిల గిల