LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chinuku Thadiki

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసుపడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ
ఆమని మధువనమా ఆ ఆమని మధువనమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దని
సాస నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ సగమగ సనిదని మద నిస నిస గసగా

పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపావె ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
ఆ ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా

సగమగా రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ సగ సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గమ రిస సనిస సనిస నిస నిస నిస గమ రిస గాగ నీని గగ నీని దగ నిగ సపా

వరములన్నీ నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతునవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ రాముని సుమ శరమా ఆ రాముని సుమ శరమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసుపడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ
ఆమని మధువనమా ఆఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

WRITERS

R.P. PATNAIK, SIRIVENNELA SITARAMA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other