LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Anadaala Puttina

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే
జమిలిగా పూసిన జాజిమల్లెలే
అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే సమ్మక్క సారక్క
జమిలిగా పూసిన జాజిమల్లెలే సమ్మక్క సారక్క
మట్టితల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే
నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే
అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే (సమ్మక్క సారక్క)
జమిలిగా పూసిన జాజిమల్లెలే (సమ్మక్క సారక్క)

వేపచెట్ల గాలులె గూ గూ గూ వీపులే నిమురంగా గూ గూ గూ
జీడి కట్ల రెమ్మలే గూ గూ గూ దిష్ఠినే తీయంగా గూ గూ గూ
ఊడలా మర్రిచెట్టూ ఉయ్యాలాలూపంగా
ఊడలా మర్రిచెట్టూ ఉయ్యాలాలూపంగా
ఒళ్ళు రాసి నీళ్ళు పోసె ఏరు కన్నతల్లి తీరు
అందాల అందాల అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే (సమ్మక్క సారక్క)
జమిలిగా పూసిన జాజిమల్లెలే (సమ్మక్క సారక్క)

పైరుకోసిన వరిమల్లె గూ గూ గూ పరిగె ఏరుకొమ్మనే గూ గూ గూ
వేరుశనగ తోటల్లే గూ గూ గూ శనగ పలుకులిచ్చెనే గూ గూ గూ
మొక్కజొన్న ఒళ్లు ఉన్నా పాలకంకూలిస్తా ఉంటె
మొక్కజొన్న ఒళ్లు ఉన్నా పాలకంకూలిస్తా ఉంటె
కొండగట్లు పంటచెట్లు కొంగు నింపి పంపుతుంటే
అందాల అందాల అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే (సమ్మక్క సారక్క)
జమిలిగా పూసిన జాజిమల్లెలే (సమ్మక్క సారక్క)

రెల్లుపూలు నవ్వ నేర్పే గూ గూ గూ హంసలేమో నడవ నేర్పే గూ గూ గూ
మైన పిట్ట మాట నేర్పే గూ గూ గూ కోకిలమ్మ పాట నేర్పే గూ గూ గూ
మొగులు తల్లీ నీడలోనా నెమలిపిల్లా ఆడానేర్పే
మొగులు తల్లీ నీడలోనా నెమలిపిల్లా ఆడానేర్పే
అల్లిబిల్లి సోపతుల మల్లెతీగ నేర్పినాది
అందాల అందాల అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే (సమ్మక్క సారక్క)
జమిలిగా పూసిన జాజిమల్లెలే (సమ్మక్క సారక్క)

బండి లోడు చూడకుండా గూ గూ గూ గూడెమంతా కాపుకాసె గూ గూ గూ
కరినపోడు చూడకుండా గూ గూ గూ గల్లీ గల్లీ కప్పు వేసే గూ గూ గూ
దొరగాడు చూడకుండా ఊరువాడా గొడుగులేసే
దొరగాడు చూడకుండా ఊరువాడా గొడుగులేసే
గుడిసె గుడిసె గడపలన్ని కడుపులోన దాచుకుంటే
అందాల అందాల అందాల మా ఊరి అక్కా చెల్లెల్లే (సమ్మక్క సారక్క)
జమిలిగా పూసిన జాజిమల్లెలే (సమ్మక్క సారక్క)

WRITERS

SUDDALA ASHOK TEJA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist