LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nammaku Nammaku

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ
నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ
నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ
నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీనమ్ వాడికి చూపెడుతుంది నరకాన్నీ
కన్నయ్యా అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది
అన్నయ్యా అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది
ఈ ఆడాళ్ళు హింసావాదులూ
మన మగ వాళ్ళు ఆశావాదులూ
నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ
నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ

ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో
మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా
ఆడదాని వల్ల సన్యాసులయిన పురుషులెంతమందో
మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా
ఆడదానికై మగాడొకడు Taj Mahal కట్టగా
మగవాడి కోసమై ఏ ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా
మగవాళ్ళు మంచి మనుషులూ
మరి ఆడాళ్ళు ముంచే మనుషులూ
నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ
నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ

పరీక్షల్లో ఎపుడూ ఆడవాళ్ళదె first place
మన కుర్రాళ్ళని అసలు చదవనిస్తే కదా బాసు
ఆటపాటల్లో ఆడాళ్ళకే అన్ని బహుమతులు
వాళ్ళ ఆటలొ పడ్డ కుర్రాళ్ళకే లేవు పుట్టగతులు
ఆడవాళ్ళ అందాలకే స్వర్ణ కిరీటాలు
వాళ్ళ వాత పడ్డ మగాళ్ళకే మాసిన గడ్డాలు
ఆడాళ్ళు మహా ముదురులూ
మన మగవాళ్ళు మావి చిగురులూ
నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ
నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ
కన్నయ్యా అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది
అన్నయ్యా అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది
ఈ ఆడాళ్ళు హింసావాదులూ
మన మగ వాళ్ళు ఆశావాదులూ

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, CHANDRA BOSE, RAJKUMAR S A

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist