LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Raamulamma O Ramulamma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తెల్లవాడు నిన్ను నాడు భగత్‌సింగ్‌ అన్నాడు
నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్‌ అన్నాడు
ఎల్లవారు రేపు మనల వేగు చుక్కలంటారు

రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ
రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ
గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మా
గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మా
రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ

వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదూ
వీరమాత కంటి తడిని భూమి తల్లి చూడలేదూ
కన్నీటళ్లతో నీవు కుడా గమ్యాలను చూడలేవు
నేనున్నా లేకున్నా
నేనున్నా లేకున్నాఎవరు ఏమైపోతున్నా
చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ
చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ
రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ

నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పొడతా
నీ ప్రస్థానానికి నే విప్లవ దరువవుతా
కాళుతున్న నరమ్‌ నరమ్‌ నీ పాటకు స్వరమైతే
కమిలే నా కనుపాపలు చూపై నీతో ఉంటాయ్‌
నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా
నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా
విప్లవమా వర్థిల్లూ
విప్లవమా వర్థిల్లని వీధి వీధి నినదిస్తా
చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ
చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ
రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ

భగత్‌సింగ్‌ నురిది ఈస్టే తిరుగుబాటు ఆగిందా
సస్తర్ హష్మీని నరికితే పాట మూగబోయిందా
ఆగదు మన రగళిజండ పోరాటం
ఉప్పెనలా పొంగుతున్న జన తీర్థం
రావద్దు నాకోసం రావద్దు నాకోసం బలి కావొద్దు
చలో బెహన్‌ కరో జంగ్‌ ఆజాదీ
చలో బెహన్‌ కరో జంగ్‌ ఆజాదీ
చలో బెహన్‌ కరో జంగ్‌ ఆజాదీ

WRITERS

SUDDHALA ASHOK TEJA, VANDEMATHARAM SRINIVAS

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist