LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Theli Manchu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వొణికింది పిలుపు నీయనా ప్రభూ
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వొణికింది పిలుపు నీయనా ప్రభూ
నీ దోవ పొడవునా కువకువలా స్వాగతము
నీ కాలి అలికిడికి మెలకువల వందనము
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు
ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభూ పవళించు భువనాలు
భానుమూర్తీ నీ ప్రాణకీర్తన విని పలుకనీ ప్రణతులనీ ప్రణవ శృతినీ
పాడనీ ప్రకృతినీ ప్రథమ కృతిని
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు
పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు
తాలయూర్చు తలిరాకు బహుపరాకులు విని దొరలనీ దోర నగవు దొంతరనీ
తరలనీ దారి తొలగి రాతిరిని
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వొణికింది పిలుపు నీయనా ప్రభూ
నీ దోవ పొడవునా కువకువలా స్వాగతము
నీ కాలి అలికిడికి మెలకువల వందనము
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

WRITERS

K V MAHADEVAN, SIRIVENNELA SITARAMA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist