LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jaga Jaga Jagadeka Veera

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
జగా జగా జగదేక వీర మగ మగ మహా రాజువేరా సొగసున సెగ రేపినవేం సుందర
జగా జగా జగదేక వీర చక చక చక నిన్ను చెర తిక మక పడుతున్నదేదో తొందర
ఒక పరి నిన్ను చూసినాక
ఒక పరి నిన్ను చూసినాక మనసిక తనలోన లేక తహ తహ తలపై పొలమారుతోందిరా నిదరే చెదర
జగా జగా జగదేక వీర మగ మగ మహా రాజువేరా సొగసున సెగ రేపినవేం సుందర
హోం మిస మిస మిస రాజహంస విల విల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలన

చల్లని గాలిల చక్కిలి గింతల ఎక్కడ చూసిన నువ్వే
చక్కదనాల సిరి చూసి కస్సుమన్న ఊపిరి ఊరుకుంటుందా
రెప్పలు వాలే నీ నిప్ప్పుల పొద్దుల ఎప్పుడు చూసిన నువ్వే
పువ్వుల తోటనొదిలేసి రివ్వుమని తుమ్మెద ఎగిరిపోతుందా
ఓఓఓ అటు ఇటు ముసిరావె నన్ను

హహహ అటు ఇటు ముసిరావె నన్ను సులువుగా విడిపోనె నిన్ను
నడుమున మెలికై నను ఖైదు చేసినా నిను కాదననూ
జగా జగా జగదేక వీర మగ మగ మహా రాజువేరా సొగసున సెగ రేపినవేం సుందర
హోం మిస మిస మిస రాజహంస విల విల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలన

మొగ్గను తుంచన సిగ్గును తెంచన దగ్గర లోనే ఉన్నాగా
దిక్కులా కళ్ళు మూసేసి నిగ నిగ బుగ్గలు పిండుకోమంటా
చుక్కలు దించన లెక్కలు తేల్చన హక్కులు అన్ని నావెగా
చెక్కర తీపి ఎరవేసి పేరా పేరా పెదవి దోచుకోమంటా
చుట్టూ కొలతలు చూసుకొన
చుట్టూ కొలతలు చూసుకోరా పట్టు పరువం నేలుకొరా పట్టు వొదలనని నువ్వు సాయమడిగితే సరే లే అనన
జగా జగా జగదేక వీర మగ మగ మహా రాజువేరా సొగసునా సెగ రేపినవేం సుందర
హోం మిస మిస మిస రాజహంస విల విల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలన

WRITERS

DEVI SRI PRASAD, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other