LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kalyana Vybhogame

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
విడిపోము మనమూ ఈ ఎడబాటు క్షణమూ ఆపైన కళ్యాణము
కళ్యాణ వైభోగమే

కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే ఏ

అనుకున్నా కొన్నాళ్ళ వనవాసము మునుముందు కావాలి మధుమాసము
అనుకున్నా కొన్నాళ్ళ వనవాసము మునుముందు కావాలి మధుమాసము
మన ప్రేమ తుది లేని ఆకాశము
మన ప్రేమ తుది లేని ఆకాశము
ప్రతి రోజు పూర్ణిమా శ్రావణము
కళ్యాణ వైభోగమే ఏ

మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా
మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా

హృదయాల నామాలె వేదాలుగా
హృదయాల నామాలె వేదాలుగా
మన అంతరంగాలే వేదికగా
కళ్యాణ వైభోగమే ఏ

వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
గెలిచాము కలిశాము దివిమెచ్చగా ఆ ఆ
గెలిచాము కలిశాము దివిమెచ్చగా
కలకాలముందాము నులివెచ్చగా
కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే

WRITERS

Acharya Aatreya, K. V. Mahadevan, Veturi Sundara Ramamurthy

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist