ఒక్కరేలే ఒక్కరేలే ఇద్దరిలా మెరిసారే
ఒక్కలాంటి హృదయాలే ఒక్కటిగా కలిసారే హా ఆ
ఇన్నాళ్లు విడివిడిగా ఉన్నరెందుకో వీరే
ఇకముందేం రాసుందో కన్నులకి ఎదురయ్యారే ఓ
పరిచయమే నేడిలా పరవశమై పరుగాపనన్నదే ఇరువురిలో
సమయమన్నదే మరిచేలా సరదాలెన్నో దరిచేరే(ఏఏఏఏ )
జతలోన జీవితం ఓ వరమే ఎటువైపు చూసిన సంబరమే
దూరమన్నదే చెదిరేలా చిరునవ్వుల్లో మునిగారే
అనగా అనగా అమెరికా కథ మొదలికా మది గదులను తెరువగా
సరదా సరదా తీరుగా సాగెనుగా వింటారా సరదాగా

ఒక్కరంటే ఒక్కరికి ఎంతో ఇష్టం పెరిగాక
క్షణమైనా చూడకపోతే కాలం కదిలేనా
ఎదలోనే ఇంకో లోకం తలుపులు తెరిచాక
చుట్టూరా ఉండే లోకం కనులకి అలుసేగా
అనగా అనగా అమెరికా కథ మొదలికా మది గదులను తెరువగా
సరదా సరదా తీరుగా సాగెనుగా వింటారా సరదాగా
అనగా అనగా అమెరికా కథ మొదలికా మది గదులను తెరువగా
సరదా సరదా తీరుగా సాగెనుగా వింటారా సరదాగా
ఒక్కరేలే ఒక్కరేలే ఇద్దరిలా మెరిసారే
ఒక్కలాంటి హృదయాలే ఒక్కటిగా కలిసారే ఓ ఏ
ఇన్నాళ్లు విడివిడిగా ఉన్నరెందుకో వీరే
ఇకముందేం రాసుందో కన్నులకి ఎదురయ్యారే