LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Premisthunna

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా ఆ ఆ ఆ
ఆశకి ఇవ్వాలే ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే
మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా ఆ ఆ ఆ

నువ్వు ఎదురే నిలబడితే వెలిగెనులే నా కంటి పాపలు
ఒక నిమిషం వదిలెలితే కురిసేనులే కన్నీటి ధారలు
అపుడెపుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా
మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది కరగదుగా తరగదుగా
మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా ఆ ఆ ఆ

నను ఎపుడూ మరువననీ పరిచావులే చేతుల్లో చేతిననీ
నను వదిలి బ్రతకవనీ తెలిసిందిలే నీ శ్వాస నేనననీ
నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం మనసుకదే వరము కదా
అణువణువు నీలో నన్నే నింపుకోడం పగటికలే అనవు కదా
మలినము లేని ప్రేమకి నువ్వు ఒక సాక్ష్యమవు చెలి
ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా ఆ ఆ ఆ
ఆశకి ఇవ్వాలే ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే
మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ హ్మ్మ్ హ్మ్మ్

WRITERS

Banisetti Suresh Kumar, Gorthi Vijaya Brahmanandam

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other