వేకువ చీకటి కలిసెను మనలా ఒకరికి ఒకరని తెలుపాలా
కలవని నీడని కాదనుకున్నా మనతో సాగను అంటుందా
విడివిడి కన్నుల కన్నీరైనా ఒకటే బాధని తెలియందా
వీచే గాలికి రాలిన పూలే పరిమళమివ్వను అంటోందా.
మాట్టాడకుండా భయపెడతుంది నా లోకమంతా ఇకపై తనదే
నా రాణి కోసం పారాణి నేనై ఇకపై తనతో కలవాలే
ముసుగనుకో వెలుగుకి ముందర ఉసురనుకో ఎందుకు తొందర
స్మృతులనుకుంటే సరిపోదా కల అనుకుంటే కలత కదా
భూమే నేను చీలను అంటే గోదారైనా పుట్టదులే
రూపం లేని రేపటి కోసం నిన్నటి ఆశలు తారాడే
మాట్టాడకుండా భయపెడతుంది నా లోకమంతా ఇకపై తనదే
నా రాణి కోసం పారాణి నేనై ఇకపై తనతో కలవాలే