LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Gang Leader

•

2019

Ninnu Chuse Anandamlo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కథ రాయడం మొదలుకాక
ముందు అప్పుడే ఎలాంటి మలుపో
కల దేనికో తెలుసుకోక
ముందు అప్పుడే ఇదేమి తలపో
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలి పొంగినదే
నిను తాకే ఆరాటం లో
నను నేనే వదిలేయసాను కదె
అరే భారమెంత నువ్వు మోపినా
మనసు తేలీకౌతు ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాక
ముందు అపుడె ఎలాంటి మలుపో

అణువణువునా ఒణుకు రేగినది
కనబడదది కనులకె
అడుగడుగునా అడుగుతోంది మది
వినబడదది చెవులకేయ
మెదడుకి పది మెలికలేయ్సినది
తెలియనిదది తెలివికీ
ఇదివరకెరుగనిది ఏమిటిది
నిదరైనది నిదరకే
తడవ తడవ గోడవాడినా
తగని తగువు పడినా
విడిగ విడిగ విసిగించినా
వీడని ముడులు పడేనా
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలి పొంగినదే
నిను తాకే ఆరాటం లో
నను నేనే వదిలేసాను కదె
అరే భారమెంత నువ్వు మోపినా
మనసు తేలీకౌతు ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాక
ముందు అపుడె ఎలాంటి మలుపో

ఒకటొకటిగా పనులు పంచుకుని
పెరిగిన మన చనువుని
సులువుగా చులకనగా చూడకని
పలికెను ప్రతి క్షణమిలా
ఒకటొకటిగా తెరలు తెంచుకుని
తరిగిని మన వెలితిని
పొరబడి నువ్వు మరల పెంచకని
అరిచెను ప్రతి కణమిలా

వెతికి వెతికి బతిమాలినా
గతము తిరగబడదే
వెనక వెనక అని చేసినా
నిజము మరుగుబడదే
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలి పొంగినదే
నిను తాకే ఆరాటం లో
నను నేనే వదిలేయసాను కాదె
అరే భారమెంత నువ్వు మోపినా
మనసు తేలీకౌతు ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలి పొంగినదే
కథ రాయడం మొదలుకాక
ముందు అపుడె ఎలాంటి మలుపో

WRITERS

Anirudh Ravichander, Chegondi Anantha Sriram

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Gang Leader

2019

01

Ra Ra (Roar of the Revengers)

Anirudh Ravichander, Bashermax, Prudhvi Chandra

02

Hoyna Hoyna

Anirudh Ravichander, Inno Genga

03

Ninnu Chuse Anandamlo

Anirudh Ravichander, Sid Sriram

04

Gangu Leader

Anirudh Ravichander

From This Artist