పదే పదే ప్రాణం నిన్నే కోరగా
కలే నిజం కాదా నువ్వే చేరగా
ప్రపంచమే లేదే ప్రతి క్షణం నువ్వే నా కథ
అలా అలా దారి నీ వైపుగా మారి సరాసరి నిన్నే చేరనా
మరీ మరీ నీతో ఉండాలని కోరి మనస్సునే రాసి ఇవ్వనా
కళ్ళు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నా
నీ కన్నుల్లో నన్నే వెతకనా
దాచుకోలేనంత ప్రేమ నా పైన నువ్వే కురిపించాలని కోరనా
చేతిలోని గీత లాగ నిన్ను నేనే మార్చుకున్నా
గాలి కూడా తాకకుండా నిన్ను నాలో దాచనా
చిరు చిరు చిరు నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే
ప్రతి అడుగుకి నీ వెనకాలే చిట్టి గుండె ఊరుకోదే
చిరు చిరు చిరు నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే
ప్రతి అడుగుకి నీ వెనకాలే కాదు అంటే ఊరుకోనే
మౌనంలో మాటే వినిపిస్తోందా
ఓ ఈనాటి ప్రేమల్లే మారిందా