మూడు ముళ్ల సాచి నేను తోడు ఉండి రోజు నిన్నుnనింగి లాగ నే చూడనా
నేల తల్లి సాచి నేను కాలు కందకుండ నిన్ను గుండె పరిచి నే మోయనా
చల్ల చల్ల గాలినై నిన్ను సేదదీర్చన
ఊపిరల్లే నిండుకొని నిన్ను నడపనా
అల్లుకోని వెచ్చగా నీతో ముచ్చటించనా ఉండనా వెంటనే నీడలా
నగిరో నగి నారో నగిరో నగి నారో ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతరో
నగిరో నగి నారో నగిరో నగి నారో నా నువ్వు నీ నేను మనమే ఒక ఊరో
మూడు ముళ్ల సాచి నేను తోడు ఉండి రోజు నిన్ను నింగి లాగ నే చూడనా
వేల చుక్కలన్నీ తేను కానీ కంట నీటి చుక్క రాలదంట
మేడ మిద్దలేవి లేవు గాని ఎండ సోకకుండా చూసుకుంటా
కనురెప్పను నేనై నిన్నే కాస్తుంటా నా కన్నుల్లోనే నిను దాయన
కదిలా అన్నోదిలా నేన్ నీదానినంటూ ఒదిగ నీ ఎదల నేనే నువ్వంటూ
నగిరో నగి నారో నగిరో నగి నారో ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతరో
నగిరో నగి నారో నగిరో నగి నారో నా నువ్వు నీ నేను మనమే ఒక ఊరో
మూడు ముళ్ల సాచి నేను తోడు ఉండి రోజు నిన్ను నింగి లాగ నే చూడనా
రావు అక్షరాలు లేదు చదువు నేను నేర్చుకున్న భాష నువ్వు
కాదు లేదు అన్న మాట రాదు నేను మార్చుకున్న తోవ నువ్వు
నా కలలకు మళ్ళీ ప్రాణం పోసావు నిను వీడక ఉంటా నీ నీడలా
కనకే నీ వెనకే నేనున్నాను జతగా కధకే మన కధకే రూపివ్వగా
నగిరో నగి నారో నగిరో నగి నారో ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతరో
నగిరో నగి నారో నగిరో నగి నారో నా నువ్వు నీ నేను మనమే ఒక ఊరో