LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Oohalu Gusagusalade

•

2014

Inthakante Vere

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఇంతకంటే వేరే అందగత్తెలు
కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు
తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటే ఏమో ఎందుకు అని
తెలియక తికమక పడుతున్నది మది
ఇంతకంటే వేరే అందగత్తెలు
కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు
తడబడి ఎరుగదు మనసీ మాదిరి

కోపగించి బుంగమూతి పెట్టినా
నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహా అద్భుతం అనేట్టుగానే ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరి
అని ఎవ్వరైనా అంటే నిజమేనని
ఒప్పేసుకుంటా అంతేగాని
నీ వెనకనే పడిన మనసుని
వద్దొద్దు అని నేనేమైనా ఆపగలనా

ఓహోహో ఓహోహో
ఓహోహో ఓహోహో

కత్రినా కరీనా అంటూ కొంతమంది
కోసమే కుర్రాళ్ళు అంత కొట్టుకుంటే
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్ళతో చూస్తే సరి
నిన్ను మించి మరొకరు లేరని
అంటారు కదా ఎవ్వరైనా అలా అన్నారని
ఊరంతా వచ్చి నిన్నే
నా కళ్ళతోటి చూస్తానంటే చూడగలనా

ఓహోహో ఓహోహో
ఓహోహో ఓహోహో

ఇంతకంటే వేరే అందగత్తెలు
కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు
తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటే ఏమో ఎందుకు అని
తెలియక తికమక పడుతున్నది మది

ఓహోహో ఓహోహో
ఓహోహో ఓహోహో ఓహోహో ఓహోహో

WRITERS

Sirivennela

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Oohalu Gusagusalade

2014

01

Eviti Hada Vidi

Kalyan Koduri

02

Inthakante

Kalyani Malik, Karunya

03

Em Sandeham Ledhu

Kalyan Koduri

04

Inthakante Vere

Hemachandra Vedala, Kalyani Malik

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None