LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sri Ramulayya

•

1998

Karma Bhoomilo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా
కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా

పారానింకా ఆరనేలేదు తోరణాల కల వాడనే లేదు (తోరణాల కల వాడనే లేదు)
పెళ్లి పందిరి తీయనే లేదు అప్పగింతలు అవ్వనే లేదు (ఆఆఆఆ)
గల గల పారే ఓ సెలయేరా
గల గల పారే ఓ సెలయేరా పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి స్మశానానికి కాపురమెళ్ళావా (ఆఆఆఆ)
కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా

రాక్షస విలువలు రాజ్యమేలెడి నరక ప్రాయపు సంఘం లోన (నరక ప్రాయపు సంఘం లోన)
మానవ ధర్మం మంటగలిసెనా మారణ హోమం జరుగుతున్నదా (ఆఆఆఆ)
కల కళలాడిన ఓ నవ వధువా
కల కళలాడిన ఓ నవ వధువా కోకిల మేధం సాగుచున్నదా జీవన రాగం ఆర్తనాదమాయే (ఆఆఆఆ)
కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాందులకే భలి అయి పోయావా

పాలపిట్టలె పాడవయేన పల్లె గుండెలే తల్లడిల్లేనా (పల్లె గుండెలే తల్లడిల్లేనా)
కదిలే కాలం ఆగిపోయిన పొడిచే పొద్దుకు గుండె పగిలేనా (ఆఆఆఆ)
పున్నమి రువ్విన వెన్నెల నవ్వా
పున్నమి రువ్విన వెన్నెల నవ్వా కారు మేఘములు కమ్మేసాయ కాల సర్పమే కోరలు సాచిందా (ఆఆఆఆ)
కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా

WRITERS

Prasad Kalekoori

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Sri Ramulayya

1998

01

Bhoomiki Pachhani

K. J. Yesudas, K. S. Chithra

02

Joharu Joharu

Vandemataram Srinivas

03

Nanuganna

S. P. Balasubrahmanyam

04

Karma Bhoomilo

K. J. Yesudas

05

Vippapoola

Vandemataram Srinivas

06

Raajyahamsa

Goreti Venkanna, Vandemataram Srinivas

07

Ghadiya Ghadiya

Vandemataram Srinivas

08

Poratala Ramulu

Sangham, Vandemataram Srinivas

From This Artist