చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
పంచ వన్నె చిలకలల్లే వజ్రాల తునకలల్లే
వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
చుట్టంలా వస్తావె చూసెల్లి పోతావె
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యరా చేరధీసుకొన
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
ముద్దులొలికే ముక్కు పుడకై ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు సన్న జూకాల్లాగా చేరుకోవే జిలుగులు చుక్క
చేతికి రంగుల గాజుల్లాగా కాలికి మువ్వల పట్టిలాగా
మేడలో పచ్చల పతాకంలాగా వదలకు నిగ నిగ నగలను తొడిగేలా
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
చిన్న నాటి తాళీనైనా నిన్ను నాలో దాచుకొన్న
కన్నే యేటి సోయగంలానన్ను నీలో పోల్చుకొన
పెదవులు పాడే కిల కిల లోన పదములు ఆడే కధాకళీ లోన
కనులను తడిపే కలతలా లోన నా అను అణువున నువ్వు కనిపించేలా
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
చుట్టంలా వస్తావె చూసెల్లి పోతావె
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యరా చేరధీసుకొన