LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Emito Idhi

•

2020

Emito Idhi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువాగనన్నది
భాషలేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే భాష అయినది
కోరుకోని కోరికేదో తీరుతున్నది
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువాగనన్నది

అలలా నా మనసు తేలుతుందే ఏఏ ఏ
వలలా నువ్వు నన్ను అల్లుతుంటే ఏఏ ఏ
కలలా చేజారిపోకముందే ఏఏ ఏ
శిలలా సమయాన్ని నిలపమందే ఏఏ ఏ
నడక మరిచి నీ అడుగు ఒడిన నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవి పైన నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నది ఓఓఓ ఓ
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువాగనన్నది

మెరిసే ఒక కొత్త వెలుగు నాలో ఓఓ ఓ
కలిపే ఒక కొత్త నిన్ను నాతో ఓఓ ఓ
నేనే ఉన్నంత వరకు నీతో ఓఓ ఓ
నిన్నే చిరునవ్వు విడవదనుకో ఓఓ ఓ
చినుకు పిలుపు విని నెమలి పింఛమున రంగులెగసినట్టు
వలపు పిలుపు విని చిన్ని మనసు చిందేసే ఆగనంటూ
కోరుకున్న కాలమేదో చేరుతున్నది ఓఓఓ ఓ
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువాగనన్నది

WRITERS

DEVI SRI PRASAD, SHREE MANI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Emito Idhi

2020

01

Emito Idhi

Haripriya, Kapil Kapilan