కనివిని ఎరుగని కదలిక మొదలైంది అడుగులో అడుగుగా
వెతికిన వెలుగుగా అలికిడి ఎదురయ్యింది నిశీధినే జయించగా
శ్రీకారం కొత్త సంకల్పానికి కళలు చిగురిస్తున్న సంతోషం ఇది
శ్రీకారం కొత్త అధ్యాయానికి చినుకు పరిమళమల్లే దీవిస్తున్నదీ పుడమి
వారసులం మనమేగా నిన్నటి మొన్నటి పద్దతికి
వారధులం మనమేగా రేపటి మార్పులకీ
Revolution it's a change revolution
Revolution it's a way revolution
We can make a better future
మండే ఎండకు friend అవడం మనకు తెలుసుగా
ఏసీ గదులకి bye bye చెప్పాము అలవోకగా
పయనం కదిలిందిలా మనసుకు నచ్చిన దారిగా
బురదేం కాదిది మనకిది ఒక సరదా సంబరం
నేలమ్మ ఒడిలో మనకిక ప్రతిదినమొక పాఠం
ప్రకృతి పిలుపిది ఇన్నాళ్ళుగా వేసిన మలుపిది
కలలకు తలపాగ చుడదాం బంగారం పండిద్దాం
Revolution it's a change revolution
Revolution it's a way revolution
We can make a better future
అచ్చంగా మనం computer కాలం యువకులం
మెదడే ఇంధనం చదువు మన సాధనం
సాధ్యం కానిది లేదంటుంది ఈ మన యవ్వనం
మనసుపడి ఏ పని చేసినా సుళువుగా రాణిస్తాం మనం
తరముల నాటిది మన తాతలు చేసిన కృషి ఇది
తెలియనిదేం కానేకాదులే మనకీవ్యవసాయం హో హో
Jeans తొడిగినా మన genes లో ఈ కళ ఉన్నదే
పదపద మొదలౌదాం నేడే నవయువ కర్షకులై