హే గోదారి గట్టు మీద రామసిలకావే
ఓ ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే
గోదారి గట్టు మీద రామసిలకావే
గోరింటాకెట్టుకున్న సందమామవే
ఊరంతా సూడు ముసుకె తన్నీ నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే
నాకంటూ ఉన్న ఒక్కే ఒక్క ఆడదిక్కువే
నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామసిలకావే
హా గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే
హే విస్తర ముందేసి పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే
చీ చీ చీ సిగ్గే లేని మొగుడు వారండోయ్
గుయ్ గుయ్ గుయ్ అంటూ మీదికిరాకండోయ్
వోయ్ వోయ్ వోయ్ గంపెడు పిల్లలతో ఇంటిని నింపావే
చాపదిండు సంసారాన్ని మేడెక్కించావే
ఇరుగుపొరుగు ముందు సరసాలొద్దండోయ్
గురుకెట్టి పడుకోరే గుర్ఖాలాగా మీవాళ్లు
ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్లయ్యి సాణాల్లే అయిన గానీ మాస్టారు
తగ్గేదే లేదంటూ నా కొంగెనకే పడుతుంటారు
హే గోదావరి గట్టు మీద రామచిలకవే
గొరింటాకెట్టుకున్న సందమామవే
కొత్త కోకేమో కన్నె కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే
ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టైనా
ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టైనా
ఈ అల్లరి గాలేమో అల్లుకుపొమ్మందే
మాటలతోటి కాలక్షేపం మానెయ్మంటుందే
అబ్బబ్బ కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చైనా
ఎవండోయ్ శ్రీవారు మళ్లీ ఎప్పుడో అవకాశం
ఎంచక్క బాగుందీ చుక్కల ఆకాశం
హే ఓసోసి ఇల్లాల బాగుందే నీ సహకారం
ముద్దులతో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామసిలకనే
హా నీ జంట కట్టుకున్న సందమామనే