Out of the darkness came the light
All lights begin in the darkness
We are all moving towards the light
Come step with me on this journey of a lifetime
ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకు బ్రతుకు
కష్టాలు రానీ కన్నీళ్లు రానీ ఏమైనా కానీ ఎదురు ఏది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు
ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకు బ్రతుకు
రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపు చప్పట్లే గుండెలలో మోగాలి
నీ నుదిటి రేఖలపై సంతకమే చేస్తున్న ఎద నిండా చిరునవ్వే చిరునామై ఉంటున్న
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం నమ్మకమే మనకున్న బలం
నీలి కళ్లల్లో మెరుపు మెరవాలి కారు చీకట్లో దారి వెతకాలి
గాలి వానల్లో ఉరుమై సాగాలి తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి
ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకు బ్రతుకు
నిద్రొకా నిలుచుంటా వెన్నెలలో చెట్టువలే
నీ కోసం వేచుంటా కన్నీటి బొట్టువలే
అడుగడుగు నీ గుండె గడియారం నేనవుతా
నువ్వు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా
రాశిగా పోసిన కలలన్ని దోసిలి నిండా నింపిస్తా చేతులు చాచిన స్నేహంలా
ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లువవుతుంది
గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకు బ్రతుకు