నెమలమ్మ నృత్యానివే ఓ పిల్ల
మాటలే మత్తులు సూపులే సూదులు
గుండెల్లో గుచ్చకురా ఓ పిలగా
పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు
నింగిలో తారలు తల దించే అందము
కోరి నన్నడగంగ కోరిక నీకేలరా
నిండుగా విరిసిన అందాల సింగిడివే
ఓ పిల్ల సూడ సక్కని గుమ్మవే
కను సైగ చేస్తావు నా ఎంట వస్తావు
మావోల్లు చూస్తారురా ఓ పిలగా
కోరి నన్నడగంగ కోరిక నీకేలరా
ఆశలెన్నో లోన చిగురిస్త ఉన్నవి
నన్ను అడుగుతున్నవే ఓ పిల్ల
మాయేదో చేసినవ్ నా మనసు దోసినవ్
నా సిక్కని ప్రేమల సెక్కిన దేవతగా
అడుగుల్ల అడుగేసి నీలోన సగమయ్యి
ఏడేడు జన్మల విడిపోని బంధమై
ఏడేడు జన్మల విడిపోని బంధమై