ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు
మన ఊరికి వచ్చాడు మన వాడై పోయాడు
మచ్చలేని చంద్రుడు మంచి తో మండుతున్న సూర్యుడు
పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు
అహ్ ఇత్తంటోడు గానీ ఊరికొక్కడు ఉంటే
చికు చింతలు అని తీరి పోయెనంటే
చీకటన్న మాట పారిపోయినట్టే హా
జై (అయ్యా) ఏం చేస్తునవ్ రా
వస్తున్నాను అయ్యా (Come on, I say)
అయ్యా వస్తున్నాను అయ్యా వస్తున్నానయ్య
వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు
హయ్య తమరి గురించే పాడుతున్నాడయ్యా
నువ్వు ఒక పని చేయర (అయ్యా)
వాడిలాగ పెద్ద పెద్ద పదాల్లో పడకుండా
చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు
నేనా అయ్యా (పాడమ్మ) నువ్వు కొట్రా
ఏ ఎదవలకు ఎదవ పనికిమాలిన చవట
తాగుబోతు కుయ్య తిరుగుబోతు జఫ్ఫా
పోలీస్ డ్రెస్‌లో ఉన్న 420 గాడని
అయ్యా ఎందయ్యా కొట్టావ్ అట్టా
ఆగు అర్థం కాకపోయిన వాడు తిట్టిందే బాగుంది రా
ఒక పని చేయ్ మరి అంత హైలో కాకుండా
మరి అంత లోలో కాకుండా మీడియంగా తిట్టేయ్ రా
You can do better, please రా
అరె భూమికి జానడు భూలోక వీరుడు
చూపులకు మామూలోడు ఈ మొనగాడు చాలనే సరుకున్నోడు
మీసం లేని మగధీరుడు సూర్యుడు సూపర్‌మ్యాన్ టైపే వీడు
జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు
తన బలమెంతో తనకే తెలియని ఆల్ ఇన్ వన్ అంజనేయుడు
చేసిన మంచిని మర్చిపోయే గజిని కజిన్ ఈ వీడు
పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు పాపారాయుడు
పైపై లుక్స్ చూసి వేసుకున్న డ్రెస్ చూసి
సమయం వచ్చిందంటే సరిగ్గా తెలుస్తుంది
సిక్స్ ప్యాక్ బాడీ లేకపోయినా
పాపారాయుడు సింగిల్ హ్యాండ్ చిటకేస్తది
కట్ ఔట్ చూస్తే కామెడీగున్నా
ఈ పోటుగాడి కంటి చూపు నరికేస్తది ఈరగేస్తది
మూమెంట్ మార్చరా రేయ్ మోమెంట్ మార్చు
నిన్నా మొన్నా నే పైన మెడితలె ఇచ్చారు ఈ వూరి జనాలు
అరె ఇప్పుడైతే పిలిచి నీకు పిల్ల నిస్తారు
చి పో అని తిట్టినోళ్లే సలాం సలాం అన్నారు
చుట్టూ పక్క పది ఊళ్ళలో ఏయ్ సమస్య వచ్చినా
ఇకపై నువ్వే దిక్కు దేవుడు
ఆళ్ళు వీళ్లొచ్చి కాళ్ళ వేళ్ళ పడిన మమ్మల్ని వదలకే ఎప్పుడూ
అండదండై మా తోడే నువ్వే లేకుంటే మమ్మల్ని కాపాడేదెవ్వడు
అబ్బబ్బబ్బా ఆ మెల్లగొట్టరా
ఇంకా మెల్లగా కొడితే తుస్స్ అంతే ఏం వినపడదు అన్నా
కొట్టరా కొట్ కొట్ కొట్ కొట్ కొట్టు
బతికున్నప్పుడే బంగారు విగ్రహం సెంటర్లో నిలబెట్టేద్దాం
శ్రీ పాపా గారి గొప్పదనం చాటేద్దాం
హోలీ దీపావళి లాగే తన పుట్టినరోజు పండుగలా జరిపించేద్దాం
దాని పేరు పాపావళి అని పేరెడదాం
చందాలెన్నో పోగుచేసి పాలరాతి గుడి కట్టిద్దాం
పాపారాయుడి వీరగాథను స్కూల్లో పాఠం చేద్దాం