మది తెలుపుతున్నది మనమొక్కటేనని
నిను చూస్తున్నా ఏం చేస్తున్నా నీడై గమనిస్తున్నా
నిన్ను నన్ను ఏకం చేసే వంతెన వలపేగా
నిన్న మొన్న ఎపుడైనా ఈ ఆనందమే చూశానా
నిన్ను నన్ను కలిపింది ఆ దైవమే అనుకోనా
పెదవిప్పలేని మాటైనా కనురెప్పతోటె తెలిపైనా
ఎవరొప్పుకోను అంటున్నా ఎద చప్పుడసలు ఆగేనా
ఎదుటే కదలాడుతున్నది ప్రాణం విడిగా
ఒకటై నడవాలి చివరికి నీడై ఓ జతగా
ఇంతమందిలో ఒకడై ఉన్నా నిను వింతగా కనిపెడుతున్నా
ఎంతమందిలో నే కలిసున్నా నీ చెంతకే చేరగ కలగన్నా
నిన్నా మొన్నా ఎపుడైనా ఈ ఆనందమే చూశానా
అంతా మాత్రం తెలిసున్నా మా ముందేమిటో ఇది తగునా
చిరు పంజరాన నేనున్నా చిరునవ్వుతోనే చూస్తున్నా
తొలిపొద్దు జాడ తెలిసున్నా సరిహద్దు దాటలేకున్నా
కలలే మరి భారమైనవి నిజమై తెలుసా
భారం ఎన్నాళ్ళో ఉండదు నను నమ్మే మనసా
నమ్మి నిన్నే నీలొ సగమైన కద
గుండెలోన నిన్ను దాచుకున్న ఇలా
గుండె చాటు గుట్టు తెలిసున్నా
అది విప్పి చెప్పలేరుగా ఎవరైనా
నిన్నా మొన్నా ఎపుడైనా ఈ అనందమే చూశానా
ఎన్నో ఎన్నో కథలున్నా ఈ కథే వింత ఎపుడైనా
నిను చూస్తున్నా ఏం చేస్తున్నా నీడై గమనిస్తున్నా