అడిగి అడగలేక ఒక మాటె అడగనా
అడిగి అడగలేక ఒక మాటె అడగనా
తెలిపి తెలుపలేక ఒక మాటె తెలుపనా
ఆశగా అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపనా నీ దానినై తెలుపనా
ఎన్ని జన్మలైనా జంట వీడరాదని
అడిగి అడగలేక ఒక మాటె అడగనా
తెలిపి తెలుపలేక ఒక మాటె తెలుపనా
నీకన్నా మెత్తనిది నీ మనసే నచ్చినది
నీకన్నా వేచనిది నీ శ్వాసే నచ్చినది
నవ్వు కన్నా సిగ్గె నాణ్యమైనది
జన్మ కన్నా ప్రేమే నమ్మికయినది
ఎన్ని జన్మలైనా ప్రేమ మాయరాదని
అడిగి అడగలేక ఒక మాటె అడగనా
తెలిపి తెలుపలేక ఒక మాటె తెలుపనా
నీకన్నా చల్లనిది నీ నీడే దొరికింది
నీకన్నా నిజమైంది నీ తోడే నాకుంది
ముళ్ళు లేని పువ్వెయ్ ప్రేమ అయినది
పూలు లేని పూజేయ్ ప్రేమ అన్నది
ఏ జన్మలోనే ప్రేమ పూజ మానరాదని
అడిగి అడగలేక ఒక మాటె అడగనా
తెలిపి తెలుపలేక ఒక మాటె తెలుపనా
ఆశగా అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపనా నీ దానినై తెలుపనా
బాస చేసుకున్న మాట మార్చరాదని