నిజంగా తా న నా న చెప్పాలంటే
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పే ఉంటే క్షమించు
చిరాకే తెప్పించానంటే క్షమించు
నీ మనస్సే నొప్పించానంటే క్షమించు
దయచేసి excuse me, దరిచేరి forgive me, ఒకసారి believe me
మాట ఆలకించు నా మనవి చిత్తగించు కాస్త హెచ్చరించు తరువాత బుజ్జగించు
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పే ఉంటే క్షమించు
పెదాల్లోని తొందరపాటే పదాల్లోని వేగిరపాటే నిదానించి బతిమాలాయి క్షమించు
పదారేళ్ళ అనుమానాలే తుదేలేని ఆలోచనలే తలొంచేసి నుంచున్నాయి క్షమించు
చూపుల లోపల కలిగిన మార్పుని సూటిగ గమనించు
చెంపల వెలుపల పొంగిన రంగుని నేరుగ గుర్తించు
హృదయం అంతట నిండిన ప్రతిమను దర్శించు ఆపైన ఆలోచించు
నిజంగా ఓహో క్షమించు నిజంగా క్షమించు
తగాదాలే చెలిమికి నాంది విభేదాలే ప్రేమ పునాది
గతం అంతా మంచికి అనుకొని క్షమించు
తపించేటి ఈ పాపాయిని వరించేటి ఈ ముద్దాయిని
ప్రియా అంటూ ముద్దుగ పిలిచి క్షమించు
పిడికెడు గుండెను చేకొని బోలెడు భారం తగ్గించు
ఇరువురి నడుమన ఇంతకు ఇంత దూరం తొలగించు
అణువణువణును మమతల చెరలో బంధించు వందేళ్ళు ఆనందించు
నిజంగా ఓహో క్షమించు నిజంగా క్షమించు
ల ల లా ల ల ల ల ల క్షమించు
ల ల లా ల ల ల ల ల క్షమించు
దయచేసి excuse me, దరిచేరి forgive me, ఒకసారి believe me
మాట ఆలకించు నా మనవి చిత్తగించు కాస్త హెచ్చరించు తరువాత బుజ్జగించు
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పే ఉంటే క్షమించు